Meda Meeda Abbayi makers planning to release movie in August
ముస్తాబవుతున్న మేడమీద అబ్బాయి
కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ నవ్యమైన కథ కథనాలతో దర్శకుడు చిత్రాన్ని చక్కగా రూపొందిస్తున్నాడు. గమ్యం శంభో శివ శంభో తర్వాత ఆ తరహా సున్నితమైన కథతో నరేష్ చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే హైలైట్‌గా వుంటుంది. సహజమైన అంశాలతో థ్రిల్లింగ్ వుంటూనే నరేష్ శైలి వినోదం వుంటుంది. నరేష్ కేరీర్‌లో మరపురాని చిత్రంగా ఇది నిలిచిపోతుందనే నమ్మకం వుంది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆగసు ్ట మొదటివారంలో పాటలను విడుదల చేసి, ఆగస్టు ద్వితీయార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు.
అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: షాన్ రెహమాన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ: శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.
Hi! I am a robot. I just upvoted you! I found similar content that readers might be interested in:
http://www.idlebrain.com/news/today/medameedaabbayi-august.html